పల్లవి :-
అర్హత లేకున్నా ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నా హెచ్చించావు - ఇది కేవలం నీ కృపయే కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే " 2 " అర్హత "
1వ చరణం :-
లోకము నన్ను ఆకర్పింపగా అల్లరితనము నా చుట్టు చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరిచితివే " 2 "
ఇంతగ నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్యా " 2 "
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను " 2 " కృపయే "
2వ చరణం :-
శ్రమలు శోధనలు నన్నాపరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే " 2 "
ఇంతగ నన్ను ప్రేమించుటకు
ఏ పాటివాడను యేసయ్యా " 2 "
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను " 2 " కృపయే "
Post a Comment