పాట యొక్క నిర్వచన సారాంశం:-
లోకాశలన్నీ ఏకమైయ్యి నన్ను బందించి, నీ కృపకు దూరం చేసినా!
ఈ లోక ప్రేమ మనసులేని మనిషినని నిందించి హేళన చేసినా!!
నా యేసయ్య ఆగాపే ప్రేమ నన్ను ఆధరించింది,
నాకు ఆధారం అయ్యింది
ఆయన ప్రేమ మన వెంటుంటే, ఆయన కృప మన తోడుంటే
ఏ కన్నీళ్లు దరి చేరవు✍️
పల్లవి'-
నా ఆధారం నీవేగా ఓ - యేసయ్య
నీ కృప ఉంటే కన్నీళ్లు - నా ధరి - చేరవయా " 2 "
అమ్మలోని కమ్మనైనా - తియ్యనైనా - తొలిప్రేమ
జంటితేనె ధరలకన్నా - మధురమైన ఘన ప్రేమా " 2 "
అనుపల్లవి:-
ఏ మంచి నాలో చూసావో - నీవే యేసయ్య
నేనంటే నీకు ఇంతటి ప్రేమా - నీదే ఈ దయా " 2 " నా ఆధారం "
చరణం 1:-
లోకాశలన్ని - ఏకమైయ్యి - బందించి నీ కృపకూ - దూరం చేయగా
ఈ లోక ప్రేమ - మనసులేని - మనీషని నిందించి - ( నను ) హేళన చేయగా " 2 "
నీలా నను ప్రేమించే - నిజ స్నేహితుడేవరు
నీవే కృపచూపించి - తుడిచావు కన్నీరు " 2 " ఏ మంచి "
చరణం 2:-
కోపించకా - నా చెంత నిలిచి - వాత్సల్యం చూపే - చూపు నీది
అది తెలిసి కూడా - నిన్ను విడచి - దూరం నేనైతే - నేరం ఎవరిది " 2 "
అనురాగం పంచె - పసి హృదయం నీది
అంతకన్నా నాకు - వేరే వరమేది " 2 " ఏ మంచి "
Post a Comment