అసమానుడైన వాడు - అవమానపరచడు నిన్ను

 పల్లవి 

అసమానుడైన వాడు - అవమానపరచడు నిన్ను 

ఓటమి ఎరుగని మన దేవుడు - ఓడిపోనివ్వడు నిన్ను 

ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్ట కాలమందు నీ చేయి విడచునా 

అసాధ్యములెన్నో దాటించిన నాధుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా 

సీయోను దేవుడే  -  నిను సిగ్గు పడనివ్వడు

కనికరా పూర్నుడే  -  నీ కన్నీరు తుడుచును  " 2 "


1వ చరణం 

అగ్ని గుండములో నేట్టివేసినా - సింహాల నోటికి నిన్ను అప్పగించినా 

శత్రువే నీ స్థితి చూసి  - అతిశయపడుచున్న 

సింహాలే నీ ఎదుటే  -  మ్రింగివేయనిలచిన 

నాకే ఏల శ్రామలంటూ -  కృంగిపోకుమా

తేరిచూడు ఏసుని  -  అగ్నిలో నిలిచెను నీకై          " 2 "

శత్రువు చేతికి  -  నిను అప్పగించడు        " సీయోను దేవుడే "


2వ చరణం 

పరిస్థితులన్నీ చేజారిపోయినా - ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా 

అనుకున్నవన్నీ దూరమైపోయినా - మంచిరోజులోస్తాయనే నిరీక్షణే లేకున్నా 

మారదీ తలరాతని  -  దిగులుపడకుమా

మారాను మధురముగా  -  మార్చెను నీకై  " 2 "

మేలులతో -  నిన్ను త్రుప్తి పరచును              " సీయోను దేవుడే "


౩వ చరణం 

ఒంటరి పోరాటమే విసుగు రేపినా - పొందిన పిలుపే భారమైపోయిన

ఆత్మీయులందరూ అవమానిస్తున్న - నమ్మదగినవారు లేక నిరాశేనిలచిన 

పిలుపునే విడచి  -   మరలిపోకుమా 

న్యాయాధి పతియే నాయకునిగా  -   నిలిపిను  నిన్ను  " 2 "

పిలచిన దేవుడు  -   నిను మరచిపోవునా       " సీయోను దేవుడే "


this song is presented by 

the new life ministries


ట్యూన్ , లిరిక్స్ , వోకల్స్ :- పాస్టర్ . డేవిడ్ వర్మ

మ్యూజిక్ :- సుధాకర్ రెల్ల.

Post a Comment