పల్లవి"
సిలువా - బరువాయెనా
రుధిరం - ధారలాయెనా
ధేహం - నలిగిపోయెనా
దైవమ్ - సిలువ మోసెనా
అను పల్లవి "
కలువరీ - గిరి సాక్ష్యమా
పాపికై - ఇంతటి భలియాగమా
కాలమే - ఎన్నడు చూడని ఘోరమా
నరులకై - ఇంతటి త్యాగామా
దేవుని - ప్రేమ ఇదే కదా
లోకము - పొందెను విడుదల
1 వ చరణం"
ఏ నేరమూ - లేకున్నను -
అన్యాయపూ - తీర్పు పొందెను
ప్రతి దోషమూ - తొలగించగ
భలి ఆయెను తానే - గోరియ పిల్లలా " 2 "
ప్రతి నరునికై - విమోచనా ధనముగా
ఆ దేవుడే - ప్రాణమునర్పించెను " 2 "
జీవమూ అందరికివ్వను
విగత జీవిగా - సిలువలో వ్రేలాడేనూ " 2 " "కలువరీ "
---------- 0 ----------
థాంక్యూ ఫర్ వాచింగ్ 🙏, ఫాలో అవర్ వెబ్సైటు teluguguchristianhub.blogspot.Com
Post a Comment