పల్లవి :-
నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా
నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా " నీ పిలుపే "
1వ చరణం :-
కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే
" 2 "
ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా
ఆలకించావు నా ప్రార్ధనా - ఆదరించావు నా యేసయ్యా
నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే
అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తనా
" కోటి రాగాలు "
2వ చరణం:-
చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే
" 2 "
జీవ గమనాల సంఘర్షణా - అంతరంగాన ఆవేదన
తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన
" నీ పిలుపే "
.... 0 ....
Image (formate)
👇👇👇
Audio file
👇👇👇
.... 0 ....
.... 0 ....