పల్లవి :-
నా హృదయం నా పైనా - దోషము మోపుచున్నదీ
అది నన్నూ ప్రతి నిత్యం - కలవర పెడుతూ ఉన్నదీ " 2 "
గత పాపం నా కనులముందూ - కదులుతున్నదీ
మితిలేనీ దైవ ప్రేమ - కృపతొ పిలుచు చున్నదీ " 2 " నా హృదయం "
1వ చరణం :-
జీవితమే ఒక నాటకమై - జీవిస్తున్న లోకంలో " 2 "
యోగ్యుడవూ అని ఎందరు అన్నా - ఏదో తీరని వ్యథ నాలో " 2 "
ఎదను దాటీ రాకున్నదీ - అవి చెప్పాలని మది విప్పాలనీ ధేవునితో ఒప్పుకోవాలనీ " 2 " నా హృదయం "
2వ చరణం :-
పాటలు ఎన్నో పాడినా - ప్రార్దనలెన్నో చేస్తున్న " 2 "
ఆత్మీయుడవూ అని అందరు అన్నా - అపరాదీననే భావనా " 2 "
వదలక వేధిస్తున్నదీ
అవి చెప్పాలని మది విప్పాలనీ ధేవునితో ఒప్పుకోవాలనీ " 2 " నా హృదయం "
.... 0 ....
Audio song
👇👇👇
.... 0 ....
Video file
.... 0 ....