పల్లవి:-
నా చేరువై - నా స్నేహమై
నను ప్రేమించె నా యేసయ్యా
" 2 "
నీ ప్రేమలోనే - నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ద్యాసలోనే - మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
అను పల్లవి :-
" తానన తానన తన నన నన నన నా
తానన తానన తన నన నన ననా నా
" 2 "
" నా చేరువై "
1వ చరణం:-
నా వేదనందూ - నా గాయమందూ
నిను చేరుకున్నా - నా యేసయ్యా
నీ చెరణమందూ - నీ ధ్యానమందూ
నిను కోరుకున్నా - నీ ప్రేమకై
కరుణించినావూ - నను పివిచినావూ గమనించినావూ - ఘన పరచినావూ
నీవేగ దేవా నా ఊపిరీ
" నా వరం - నా బలం - నీవే నా గానం
నా ధనం - నా ఘనం - నీవే ఆనందం
తోడుగ - నీడగ నీవే - నా ధైవం
ఎన్నడు - మారనీ ప్రేమే - నా సంతోషం
" నా చేరువై "
2వ చరణం :-
నా జీవితానా - ఏ భారమైనా
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూలమైన - ఏ ప్రలయమైనా
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్యా
విలువైన ప్రేమా - కనపరచినావూ
బలపరచి నన్నూ - గెలిపించినావూ
నీవేగ దేవా - నా ఊపిరి
తానన తానన తన నన నన నన నా
తానన తానన తన నన నన ననా నా
" 2 "
" నా చేరువై "
.... 0 ....
Audio song
👇👇👇
.... 0 ....