ప్రార్థన వలెనే పయనము - ప్రార్థనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం " 2 "
ప్రభువా ప్రార్ధన నేర్పయ్య -
ప్రార్ధించకుండా నేను ఉండలేనయా " 2 "
నీ పాదాలు తడపకుండా -
నా పయనం సాగదయా " 2 " ప్రార్ధనవలనే "
1వ చరణం :-
ప్రార్ధనలో నాటునది -
పెల్లగించుట అసాధ్యము
ప్రార్థనలో పోరాడునది -
పొందకపోవుట అసాధ్యము " 2 "
ప్రార్థనలో ప్రాకులాడునది -
పతనమవ్వుట అసాధ్యము " 2 "
ప్రార్థనలో పదునైనది -
పనిచేయకపోవుట అసాధ్యము " 2 " ప్రభువా "
2వ చరణం
ప్రార్థనలో కన్నీళ్లు -
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్థనలో మూలుగునది -
మరుగైపోవుట అసాధ్యము " 2 "
ప్రార్థనలో నలిగితే -
నష్టపోవుట అసాధ్యము " 2 "
ప్రార్థనలో పెనుగులాడితే -
పడిపోవుట అసాధ్యము " 2 " ప్రభువా "
Video song
......... 0 ........
Post a Comment