పల్లవి:-
మనసా ఓ మనసా - దిగులు పడకే మనసా
మనసారా శరణు వేడుమా - మదిలోన
క్రీస్తు ప్రభుని నిలుపుమా " 2 "
ఆపత్కాలము నందు - ఆదుకొను నాథుడు
ఆశ్రయించిన వారిని - ఆదరించు దేవుడు ఆశ్చర్యకరుడు - ఆలోచన పరుడు బలవంతుడైన ప్రభువు - మనకుండగా భయపడకుమా
" మనసా ఓ మనసా "
1వ చరణం:-
ప్రభుతో జీవితమే - పరమార్థమని ఎరిగి
ప్రభులో జీవించు చుండగా
ప్రభు సందేశమే - లోకానికి వెలుగనీ
ప్రభునే ప్రకటించు చుండగా " 2 "
సత్యము ఎరుగని - చీకటి శక్తులు
సత్య సువార్తనూ - అవరోదించగా
పావన మూర్తిని - పరిహాసించచూ
పాతకులెందరో - దూషణ చేయుచూ
ద్వేషమే - శ్వాసగా - రగిలినా
బలవంతుడైన ప్రభువు మనకు ఉండగా
భయపడకు మా " మనసా ఓ మనసా "
2వ చరణం:-
దేవుని ఆజ్ఞకు - లోబడి కొందరు
ఆయన మార్గమందు నిలువగా
దేవుని పిలుపునూ - పొందిన కొందరు
ఆయన మాటలనే పలకగా " 2 "
జీవముగల వాడు - మా దేవుడు అని తెలిపి
చావుకు ఎదురెళ్లి - గెలిచేను కొందరు
బ్రతుకుట క్రీస్తే - చావైతే మేలని
హతసాక్షులుగా - మారేను కొందరు
మాధిరి ఇంకెందరో చూపగా
బలవంతుడైన ప్రభువు మనకు ఉండగా భయపడకుమా
" మనసా ఓ మనసా "
3వ చరణం:-
శాశ్వత రాజ్యము - నిత్య నివాసము
ప్రభుతో వశియించు భాగ్యము
శోధన సాహితపు నమ్మిక జీవితం
మరణం వరకు పోరాటమూ " 2 "
ఆధ్యము నుండియూ - భక్తులు ఎందరో
అవనిలో జీవితం - క్షణ భంగురమని
పరదేశీయులమై - ఇలా జీవించూచూ
పరలోకమే మన చిర జీవంబనీ
ఓర్పుతో నమ్మి జీవించగా
బలవంతులైన ప్రభువు మనకు ఉండగా భయపడకు
" మనసా ఓ మనసా "
.... 0 ....
Audio song
👇👇👇
.... 0 ....
.... 0 ....