పల్లవి :-
నీవున్నావనీ నేనున్నానయ్యా - నీ మాటకు వేచి ఉన్నానయా " 2 "
నా యేసయ్యా … నా యేసయ్యా … నా యేసయ్యా … నా యేసయ్యా
" నీవున్నావని "
1వ చరణం :-
అలనాడు నీవు మోషేతొ కూడా - వాగ్దానముతొ మాట్లాడినావు
ఇశ్రాయేలును పరిశుద్దపరిచి - వాగ్దాన భూమిలో చేర్చినావూ " 2 "
మాట్లాడుమా నాతొ మాట్లాడుమా - వాగ్దానముతో మాట్లాడుమా " 2 "
"నా యేసయ్యా "
2వ చరణం :-
అలనాడు నీవు ఆ సౌలుతో - దమస్కు మార్గాన మాట్లాడినావు
దర్శనమిచ్చి పిలిచినావు - ఆది ఆపోస్తునిగి చేసినావు " 2 "
విశ్వాస యోధునిగా లేపినావు - పౌలుగా మార్చినావు " 2 "
"నా యేసయ్యా "
3వ చరణం:-
ఈనాడు నేను నీ కోసమే ఉన్నాను లే - వేచి వున్నానులే
నీ వాక్యముతొ నన్ను నింపి - నీ ఆయుధముగ వాడుకొనుమూ " 2 "
బలపరచుమా దేవా స్తిరపరచుమా - నీ పరిచర్యలో కొనసాగించూ " 2 "
"నా యేసయ్యా "
---- 0 ----
Audio file
-- No --
---- 0 ----
Video file
--- NO ---