పల్లవి:-ఎన్నెన్నొ వేదనలు అనుభవించినాడు -
నిన్ను రక్షించుట కొరకే - మన పాపం కడుగుటకొరకే "2"అనుపల్లవి:-
వెల లేనిదీ ఆ త్యాగం - కనలేనిది ఆ మరణం. "2"
క్రీస్తేసుని ఈ త్యాగము - మనకోసమే బలియాగము...
నీ రక్షణె తన ధ్యేయము - నువు నమ్మినచొ నిత్యజీవము "2" " ఎన్నెన్నే "
1వ చరణం :-
ఎంతెంత అవమానము - సహియించెను తన మౌనం" 2 "
అన్యాయమె గెలిచిందిగా - మన శిక్షకు తను తలవంచెగా " 2 "
మెలిపెట్టిన కొరడాలు...చీల్చేసెను తనువనువు
ఒలికించెను తన రక్తమే...మన పాప పరిహారమె..అది మన పాప పరిహారమే " క్రీస్తేసుని"
2వ చరణం :-
శిరమంతా ముండ్లేగా - పలుమార్లు దిగబడగా " 2 "
మోసాడు శిలువ భాగమే - మన ఘోర పాప భారమే " 2 "
బందించెను ఆ శీలలు...వ్రేలాడెను తన తనువు
విడిచేసె తన శ్వాసనే...విమోచించే మన ప్రాణమే -
విమోచించే మన ప్రాణమే " క్రీస్తేసుని "
----------- 0 --------------
Image song (formate)
Click image
Audio file
👇👇👇
Video file
---- 0 ----
Tags:
LYRICS AUDIO VIDEO songs