1. ని దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. (నిర్గమ 20:2)
2. పైన ఆకాశమందె గాని, క్రింద భూమియందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని యుండు దేని రూపమునయినను, విగ్రహమునయినను నీవు చేసికొన కూడదు.(నిర్గమ 20:4)
3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్దముగా ఉచ్చరింపకూడదు.
(నిర్గమ 20:7)
4. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనవలెను.
(నిర్గమ 20:8)
5. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము.
(నిర్గమ 20:12)
6. నరహత్య చేయకూడదు.
(నిర్గమ 20:13)
7. వ్యభిచరించకూడదు.
(నిర్గమ 20:14)
8. దొంగిలకూడదు.
(నిర్గమ 20:15)
9. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. (నిర్గమ 20:16)
10. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
(నిర్గమ 20:17).