పాట పేరు :- నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా తెలుగు సాంగ్ లిరిక్స్

 ప :- నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా " 2 "

        పరిశోధించి తెలుసుకున్నావు - చుట్టూ నన్ను ఆవరించావు " 2 "

        కూర్చుండుట ( నె ) లేచి యుండుట " 2 " 

        బాగుగా ఎరిగియున్నావు " 2 " నన్ను "


1 :- తలంపులు తపనయు అన్నీ - అన్నియు ఎరిగి యున్నావు " 2 "

        నడచినను పడుకున్నను - అయ్యా నీవేరిగి యున్నావు   " 2 " 

        ధన్యవాదం - యేసురాజా " 2 " నన్ను చూచు "


2 :- వెనుకను ముందును కప్పి - చుట్టూ నన్ను ఆవరించావు " 2 " 

       ( నీ ) చేతులచే అనుదినము - పట్టీ నీవే నడిపించావు " 2 "

         ధన్యవాదం - యేసురాజా " 2 " నన్ను చూచు "


3 :- పిండమునై ఉండగా నీ కన్నులకు -  మారుగై నేనుండలేదయ్యా " 2 "

        విచిత్రముగా  నిర్మించితివి  - ఆశ్చర్యమే  కలుగుచున్నాది " 2 "

        ధన్యవాదం - యేసురాజా " 2 " నన్ను చూచు "


 ---------- 0 ----------


Post a Comment