పల్లవి :-
నీవు తప్పా - నాకు ఇలలో - ఎవరున్నారయా
నీ ప్రేమకన్నా - సాటి భువిపై - ఏది లేదయా
నువ్వంటు లేకుంటే - నె బ్రతుకేలేనయ్య
నేనిలా ఉన్నానంటే - నీ దయేనయా
నీ ప్రేమ లేకుంటే - ఈ జన్మ లేదయ్యా
గుండెల్లో నిండున్నావు - ఓ నా యేసయ్య
" నీవు తప్పా "
1వ చరణం :-
కష్టాల చేరలో - చిక్కుకున్న నన్ను
నీ ప్రేమ వరమే - కురిపించినావు
ఈ లోకమంతా - వెలివేస్తున్నా
నీ ప్రేమ నాపై - చూపించినావు
నీ అరచేతిలో - నను దాచినావయా
నా చేయి విడువకా - నను నడిపినావయా
నా తోడై నా నిడై - నీవుంటే చాలాయా
"నువ్వంటు లేకుంటే "
2వ చరణం :-
కన్నీటి అలలో - మునిగిన నన్ను
నీ దివ్య కరమే - అందించినావు
ఆ సిలువలోనే - నీ ప్రాణమును
నను రక్షింపా - అర్పించినావు
నీ కృపనీడలో - నను కాచినావయా
ఒక క్షణము వీడకా - కాపాడినావయా
నా శ్వాసై నా ధ్యాసై - నీవుంటే చాలాయా
" నువ్వంటు లేకుంటే "
------ 0 ------
Post a Comment