పల్లవి :-
కల్వరి గిరిపై - సిలువ భారం
భరించితివా - ఓ నా ప్రభువా
నా పాపముకై - నీ రక్తమును
సిలువపైన - అర్పించితివా " 2 "
1వ చరణం :-
దుష్టుండనై - బల్లెముబోని
గుచ్చితి తండ్రి - ప్రక్కాలోన " 2 "
కేక వేసి - నీదు ప్రాణం
సిలువపైన - అర్పించితివా " 2 " కల్వరి "
2వ చరణం :-
మూడు దినముల్ - సమాధిలో
ముదముతోడ - నిద్రించితివా " 2 "
నా రక్షణకై - సజీవముతో
సమాధి గెల్చి - లేచిన తండ్రి " 2 " కల్వరి "
3 వ చరణం :-
ఆరోహణమై - వాగ్దానాత్మాన్
సంఘముపైకి - పంపించితివా " 2 "
నీ రాకడకై - నీరీక్షణతో
నిందలనెల్ల - భరీయించెదను " 2 " కల్వరి "
--------- 0 ---------
Post a Comment