పల్లవి:-
నేను ఎల్లప్పుడూ - యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి - నా నోట నుండున్ "2"
అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే -
తన చిత్తమునకు తల వంచితే "2"
ఆరాధన ఆపను - స్తుతించుట మాటను "2"
స్తుతించుట మాటను
1 చరణం:-
కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాదలైన
స్థితిగతులే మారినా - అవకాశం చేజారిన "2"
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4" అంతా నా "
2వ చరణం:-
ఆస్తులన్ని కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి బరువైనా - గుండెలే పగిలినా "2"
ఆ ఆఆఆ ఆ ఆఆఆ
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను "2"
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"అంతా నా"
3వ చరణం:-
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు - ఆకాశమందునా ? "2"
ఆఆ ఆ ఆఆ ఆ - ఆఆ ఆ ఆఆ
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు "4"అంతా నా"
4వ చరణం:-
సంకల్పాన పిలుపొంది - నినె ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2"
ఆ ఆఆ ఆ ఆఆ ఆ
యేసుని సారూప్యము - నేను పొందాలని "2"
అనుమతించిన ఈ - విలువైన సిలువకై "2"అంతా నా"
5వ చరణం:-
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలుసుకొందును"2"
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే "2"
అభ్యసించినా నీతి - సమాధాన ఫలమే "2"అంతా నా"
.... 0 ....
Audio file