స్తుతియాగము చేయుదము

 



పల్లవి:- స్తుతియాగము చేయుదము - స్తుతిగీతము పాడెదము
స్తుతులందు మా యెహోవా - స్తోత్రార్హుడా ఘనుండా 

" స్తుతి "

1వ చరణం:-
సర్వజగతికి కర్తవు - సర్వజనులకు తండ్రివి
సర్వజ్ఞానము కల్గినట్టి - సర్వశక్తి సంపన్నుడా " స్తుతి "

2వ చరణం:-
నిత్యజీవ ప్రదాతవు - నీతి కలిగిన రాజువు
నిత్యజీవము కల్గినట్టి - నిత్యసత్యదేవుడా " స్తుతి "

3వ చరణం:-
ప్రేమయై వెలుగొందువాడవు - పరిశుద్ధ పవిత్రుడా
దీర్ఘశాంతము కల్గినట్టి - న్యాయమూర్తివి నీవగా " స్తుతి "

4వ చరణం:-
ఆత్మయై ప్రభవిల్లువాడవు - ఆది అంతము లేనివాడవు
దివ్యకాంతులు కల్గినట్టి - తేజోమూర్తివి నీవెగా " స్తుతి "

Post a Comment